Sunday, 3 August 2014

అక్రమ సంబంధమే హత్యకు కారణo

4 రోజుల పాటు కిడ్నాప్‌కు గురైన కొయ్యలగూడెం మండలంలోని కన్నాపురంనకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి బొమ్మా వెంకట రామగంట్లయ్య బొమ్మా హరినాథ్ (24)  హత్యకు గురయ్యాడు

వివరాలు ఇవి ..
గత నెల 29 వ తేదీ రాత్రి 10.30 గంటలకు హరినాథ్ బాకీల వసూలు పేరుతో తన అక్క ఇంటికి వెళుతున్నానని తల్లిదండ్రులతో చెప్పి అద్దె కారులో బయలుదేరాడు. తన అక్క ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం మందలపల్లిలో ఉంటున్నారు హరినాథ్ చెప్పిన విధంగా మందలపల్లి వెళ్లకుండా దమ్మపేట వెళ్ళాడు. 30వ తేదీ ఉదయం  తన కుమారుడి సెల్‌ఫోన్ నుండి  ఫోన్ వచ్చింది, మీ కుమారుడిని కిడ్నాప్ చేసామని, పది లక్షల రూపాయలు జంగారెడ్డిగూడెం తెచ్చి ఇస్తే విడిచిపెడతామని  బెదిరించారు.31న కిడ్నాపర్లు చెప్పిన విధంగా కుమారుడిని కాపాడుకునేందుకు పది లక్షల నగదుతో తండ్రి గంట్లయ్య జంగారెడ్డిగూడెం పారిజాతగిరి సమీపంలో దుండగులకు అందేలా చేశారు ముసుగు ధరించిన ఇద్దరు కిడ్నాపర్లు నగదు తీసుకు వెళ్ళి పోయారు.1వ తేదీ మధ్యాహ్నం  కూడా హరినాథ్ రాక పోయేసరికి అనుమానం వచ్చి తన కుమారుడిని కిడ్నాప్ చేసారని  తల్లి జానకిరత్నం 1వ తేదీన కొయ్యలగూడెం , అశ్వారావుపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణ చేపట్టిన జంగారెడ్డిగూడెం సి.ఐ ఎం.అంబికా ప్రసాద్, స్థానిక ఎస్సై ఎస్‌ఆర్‌ఆర్ గంగాధర్, అశ్వారావుపేట పోలీసు పోలీసులు హరినాథ్‌ను దమ్మపేట  దమ్మపేటకు 35 కిలోమీటర్ల దూరంలోని అడవిలోహత్య చేసినట్టు గుర్తించారు.

పోలీసులు హరినాథ్ సెల్‌ఫోన్‌ కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు . అశ్వారావుపేట మండలం జమ్మిగూడెంకు చెందిన పొదలి వెంకటేశ్వరరావుగా గుర్తించారు.  పట్టుబడ్ట నిందితులు పట్వారిగూడెంకు చెందిన అతని బావమరిది కంచర్ల  నాగరాజులను పోలీసులు విచారించగా . 29వ తేదీ రాత్రి జమ్మిగూడెంకు పొదిలి వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్ళిన హరినాథ్‌ను 30వ తేదీనే హతమార్చివేసారు. పొదిలి వెంకటేశ్వరరావు భార్యతో హరినాథ్‌కు ఉన్న అక్రమ సంబంధమే అందుకు కారణమని పోలీసులు తేల్చివేసారు. వెంకటేశ్వరరావు ట్రాక్టర్‌కు హరినాథ్ తండ్రి గంటయ్య పెద్ద మొత్తంలో  ఫైనాన్స్ చేయటంతో పొదిలి వెంకటేశ్వరరావు ఇంటికి తరచు వెళ్ళడంతో హరినాథ్‌కు అతని భార్యతో పరిచయమైందని తెలిసింది. 29వ తేదీ రాత్రి వెంకటేశ్వరరావు, అతని బావమరిది నాగరాజు సహాయంతో పట్టుకున్నట్టు తెలిసింది. హరినాథ్‌కు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి  30వ తేదీన దమ్మపేట మండలంలోని అడవిలో చినపూసలలంక గ్రామం చివర వాగులో చంపి పడవేసినట్టు వివరించారు.
హరినాథ్ చేతులు కాళ్ళు కట్టివేసి కర్రలతో కొట్టామని అతను అప్పటికీ ప్రాణాలతో ఉండటంతో మెడ చుట్టూ టవల్ బిగించి లాగామని తెలిపాడు. అప్పటికీ చావక పోవడంతో బ్లేడుతో కంఠం కోసివేసి చంపి
వాగు వద్దకు తీసుకువచ్చి ఎత్తు నుంచి లోయలో పడవేసారని తెలిసింది.హరినాథ్ సెల్‌ఫోన్ తీసుకుని వాగు సమీపంలోని ఇసుకలో పూడ్చి పెట్టినట్టు తెలిపాడు. ఆదివారం హరినాథ్ హత్య వార్త అందుకున్న తల్లి జానకీరత్నం, ఇతర కుటుంబ సభ్యులు కుప్పకూలి పోయారు. రోధనలు మిన్నంటాయి.అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం పోలీసులు సి.ఐ ఎం.అంబికా ప్రసాద్, ఎస్సై గంగాధరరావు, హరినాథ్ కుటుంబ సభ్యులు దమ్మపేటలో సంఘటనా స్థలానికి వెళ్ళారు.మృతదేహాన్ని పైకి తీయించారు.

క్షేమంగా వస్తాడని నాలుగు రోజులుగా ఎదురు చూసిన హరినాథ్ తలిదండ్రులకు ఆదివారం ఉదయం చేదు కబురు అందటంతో శోకసంద్రంలో మునిగిపోయారు.

March 31..