Tuesday, 23 September 2014

‘గోపాలా గోపాలా’ పై ఒక షాకింగ్ రూమర్

పవన్ నటిస్తున్న ‘గోపాలా గోపాలా’ పై ఒక షాకింగ్ రూమర్ ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ వల్ల ఒక సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది అనే వార్తలు గతంలో ఎప్పుడు రాని విధంగా పవన్ ను టార్గెట్ చేస్తూ గోపాలుడి సినిమా పై రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. గతంలో పవన్ సినిమాల నిర్మాణం కొద్దిగా ఆలస్యం అయినా ‘గబ్బర్ సింగ్’ నుండి పవన్ తన వేగాన్ని పెంచాడు. ఇక పూరి జగన్నాథ్ దర్సకత్వంలో నటించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' ను పవన్ అతి తక్కువ కాలంలో పూర్తి చేసి టాలీవుడ్ కు షాక్ ఇచ్చాడు. ‘అత్తారింటికి దారేది’ సినిమా మెగా సక్సస్ తో పవన్ మరింత వేగం పెంచుతాడు అనుకుంటే ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదలై ఒక సంవత్సరం దాటిపోతున్నా రకరకాల కారణాలతో పవన్ తాను నటించిన ఒక్క సినిమా కూడ మొదలు పెట్టి పూర్తి చేయలేకపోయాడు. ఎన్నికల హడావిడి తరువాత పవన్ మేకప్ వేసుకుని నటిస్తున్న ‘గోపాలా గోపాలా’ షూటింగ్ లో పవన్ ప్రవర్తన పై అందర్నీ ఆశ్చర్యపరిచే గాసిప్పులు బయట హడావిడి చేస్తున్నాయి. 'గోపాల గోపాల' షూటింగ్‌లో ఎక్కువసేపు పవన్ ఉండలేకపోతున్నాడని, ఎప్పుడు లేని విధంగా షూటింగ్ సన్నివేశాల చిత్రీకరణ విషయంలో పెద్దగా ఆశక్తి చూపడం లేదనే వార్తల హడావిడి జోరుగా జరుగుతోంది. అంతేకాదు ఈ మూవీలో వెంకటేష్ తో ఉన్న కాంబినేషన్ సీన్స్ చిత్రీకరణ సమయంలో అరగంట సెట్లో ఉంటే 3- 4 గంటలు రెస్ట్ తీసుకుంటున్నాడని ఫిలింనగర్ లో గుసగుసలు వినపడుతున్నాయి. అసలు పవన్ ఎందుకింత అసౌకర్యంగా ఉంటున్నాడో ఎవరికీ అంతుపట్టడంలేదట. షెడ్యూల్స్ మారుతున్నా, షూటింగ్ ముందుకు కదలక పోవడంతో కో ఆర్టిస్ట్స్ డేట్స్ వృధా అవుతున్నాయని ఈ సినిమా యూనిట్ వారు సైలెంట్ మోడ్‌లో అనుకుంటున్నారని టాక్. ఈ సినిమాలో పవన్ చేసేది 40 నిమిషాల క్యారెక్టరే అయినా షూటింగ్‌కు ఇంకెన్ని రోజులు పడుతుందో తెలియక ఈ సినిమా యూనిట్ సభ్యులు అయోమయంగా ఉన్నారు అనే వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే పవన్ ఈ విధంగా ప్రవర్తించడం వెనుక పవన్ ను బాధ పెడుతున్న వెన్ను నొప్పా? లేదా మరేదైనా కారణమా అనే విషయాల పై స్పష్టత లేదు అని కూడ అంటున్నారు.

Sunday, 14 September 2014

Saturday, 13 September 2014

మరికొద్ది రోజులలో సిటీ కేబుల్ ప్రసారాలను సమూలంగా తుడిచిపెట్టే రిలయెన్స్ జియో - కేబుల్ పరిశ్రమలో భయాందోళనలు




రిలయెన్స్ జియో పేరుతో 70 వేల కోట్ల పెట్టుబడులతో ప్రారంభమవుతున్న 4G సేవలు కేబుల్, డిటిహెచ్ వ్యాపారాన్ని సమూలంగా తుడిచిపెట్టే ప్రమాదముందని తేలడంతో కేబుల్ పరిశ్రమలో భయాందోళనలు మొదలయ్యాయి.
బ్రాడ్ బాండ్ వ్యాపారానికి కూడా పెనుప్రమాదం ముంచుకొస్తోంది.
అతి తక్కువ ధరలో వినియోగదారులకు అత్యధిక సేవలందించటం ధ్యేయమంటున్న రిలయెన్స్ ఒక విప్లవం తీసుకురాబోతున్నదన్నది మాత్రం నిజం.
ఒక డేటా కార్డ్ లాంటి పరికరం సాయంతో టీవీ చానల్స్ ప్రసారాలు అందుతాయి. కేబుల్ అవసరమే ఉండదు. ఇది వైర్ లెస్. డిటిహెచ్ తరహాలో డిష్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. కోరుకున్న చానల్స్ కు మాత్రమే డబ్బు చెల్లించవచ్చు. నెలనెలా రీచార్జ్ చేసుకోవటమే. డిజిటల్ నాణ్యత. కారులో టీవీ ఉన్నా ప్రసారాలు అందుతాయి. ఇక మీదట బస్సుల్లో ఉండే టీవీ సెట్లలోనూ రిలయెన్స్ జియో సాయంతో చానల్స్ ప్రసారాలు చూడవచ్చు.  టీవీ కార్యక్రమాలు రికార్డ్ చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది. రిలయెన్స్ జియో అందించే డేటా కార్డ్/డాంగిల్ తీసుకొని మనకు కావాల్సిన ఇతర సౌకర్యాలు కూడా కలుపుకోవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా తీసుకోవచ్చు. వై ఫై కనెక్టివిటీ కూడా పెన్ డ్రైవ్ పరిమాణంలో ఉండే అదే పరికరం అందిస్తుంది. టెలిఫోన్ కి కూడా ఇదే ఉపయోగపడుతుంది.
అంటే సుమారు ఐదు వందల రూపాయాల్లో టీవీ, ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యం ఇంటింటికీ అందించగలిగే బృహత్తర పథకం ఇది. .

కొంతకాలంగా రిలయెన్స్ ఈ పథకాన్ని సిద్ధం చేసుకున్నప్పటికీ, బిజెపి అధికారంలోకి రాగానే కార్యాచరణ వేగవంతం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఫైబర్ ఆప్టిక్ నెట్ వర్క్ వాడుకుంటూ ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల్లో వై ఫై ని యాక్టివేట్ చేసింది. జియో కోసం పది వేలమంది పూర్తికాలపు ఉద్యోగులు పనిచేస్తుందగా మరో 30 వేలమంది నిపుణులు సేవలందిస్తున్నారు. పైగా ఈ నెట్ వర్క్ కోసం డిజిటల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ సమకూర్చటానికి లక్షమంది పనిచేస్తున్నారు. భారత్ లో అతిపెద్ద వ్యాపారాల్లో ఇది ఒకటి అవుతుందని అంబానీ అంటున్నారు.
వచ్చే జనవరి నుంచి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. మొదటి విడతలోనే 90 శాతం ప్రజలకు అందేలా 5,000 పట్టణాల్లోనూ, 2,15,000 గ్రామాల్లోనూ జియో 4G సేవలు విస్తరిస్తారు. ఆ తరువాత మొత్తం ఆరులక్షల గ్రామాల్లో మిగిలిపోయినవాటికి అందిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, భవిష్యత్తులో మరే ఇతర సాంకేతిక పరిజ్ఞానమూ దీనికి సాటిరాకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని ముఖేష్ అంబానీ చెబుతున్నారు.

ఈ భారీ ప్రాజెక్టు వలన కేబుల్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటుంది. ఇప్పటివరకు ఏర్పాటుచేసుకున్న మౌలిక వసతులన్నీ వృధా అవుతాయి. కేబుల్స్, కంట్రోల్ రూమ్స్, డిజిటల్ హెడ్ ఎండ్స్, సెట్ టాప్ బాక్స్ లు..ఇవన్నీ మూలనపడతాయి. ఈ నష్టాన్ని ఇప్పటికిప్పుడు అంచనావేయటం కష్టమే అయినా సగటున కనెక్షన్ కు రెండు వేల చొప్పున 15 కోట్ల కనెక్షన్లున్న కేబుల్ పరిశ్రమకు 30 వేలకోట్ల నష్టం ఉంటుంది. డిజిటైజేషన్ మీద వెచ్చించిన భారీ మొత్తాలతో కలుపుకుంటే ఇది 50 వేలకోట్ల పైమాటే. అదే సమయంలో డిటిహెచ్ సంస్థలకూ విపరీతమైన నష్టాలుంటాయి, ఇదంతా మౌలిక సదుపాయాలమీద పెట్టిన ఖర్చు మాత్రమే. ఈ పరిశ్రమలో ఉన్న లక్షలాది మంది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగులు, స్వయం ఉపాధిగా మార్చుకున్నవారూ వీధినపడే ప్రమాదముంది.
రిలయెన్స్ జియో వలన ఒకవైపు కేబుల్, డిటిహెచ్, ఇంటర్నెట్ వ్యాపారాలకు పెనుముప్పు ఖాయమని అర్థమవుతున్నప్పటికీ వినియోగదారులకు కలిగే సౌకర్యం మాత్రం చాల ఎక్కువ. పైగా తక్కువ ధరలకే బహుళ సౌకర్యాలు అందటం మంచి పరిణామం. కానీ గుత్తాధిపత్యం కారణంగా ముందు ముందు వాటిల్లే ప్రమాదాన్ని పసిగట్టి ప్రభుత్వం తగిన ఆంక్షలు విధించకపోతే వినియోగదారులమీద క్రమంగా భారం పెరగవచ్చు. రిలయెన్స్ జియో 4G సేవల ప్రభావాన్ని గ్రహించటం వల్లనే ప్రభుత్వం డిజిటైజేషన్ విషయంలో వేగం తగ్గించిందన్న అనుమానాలు కూడా టీవీ పరిశ్రమలో మొదలయ్యాయి.

Tuesday, 9 September 2014

జంగారెడ్డిగూడెంలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి




09-09-2014 -  పశ్చిమగోదావరి జిల్లా , జంగారెడ్డిగూడెం,  z .p .హై స్కూల్ సమీపంలో మంగళవారం సాయంత్రం పెచ్చేటి బేబి కుమారి (28) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఉందని భర్త ప్రసాద్ తెలుపగా , తన  భర్త ప్రసాదే ఉరి వేసి చంపినట్లు గా బేబి భందువులు ఆరోపిస్తున్నారు.  బేబి కుమారి తో కృష్ణ జిల్లా మూల లంకకు చెందిన దుర్గాప్రసాద్ కి  13 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి 12 ఏళ్ల కుమార్తె ఉంది.  న్యూ డీల్స్ మాస్టర్ గ జీవనం సాగిస్తున్న భర్త దేవీప్రసాద్ తరచూ భార్య బేబి ని వేధిస్తూ ఉండేవాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అందు చేతనే బేబి చనిపోయిందని కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

March 31..