Monday, 4 August 2014

ఆంధ్రప్రదేశ్‌లో ణమాఫీపై ప్రభుత్వం ఆదేశాలు జారీ!

ఆంధ్రప్రదేశ్‌లో రుణమాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారు అధికారపూర్వక ఉత్తర్వులు జారీ చేసింది.ఒక్కో రైతు కుటుంబానికి లక్షన్నర చొప్పున.. డ్వాక్రా మహిళలకు లక్ష రూపాయల చొప్పున రుణ మాఫీ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఎన్నికల హామీలో భాగంగా రైతులకు, డ్వాక్రా మహిళలకు, చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై కోటయ్య కమిటీని నియమించి.. దాని సిఫార్సుల ప్రకారం కుటుంబానికి లక్షన్నర మాఫీ చేస్తామని ప్రకటించారు. అయితే, ఒక కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా రుణమాఫీ మాత్రం ఒక్క రికి మాత్రమే వర్తించనుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదే విషయాన్ని జిల్లా స్థాయి నుంచి కిందిస్థాయి అధికారులంతా రైతులకు తెలియజేసి వారిని చైతన్యం చేయాలని ప్రభుత్వం కోరింది. బ్యాంకుల నుంచి తిరిగి రుణం ఇప్పించే బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. కాగా, రుణాల రీషెడ్యూలుపై ఇప్పటికే పలుమార్లు ఆర్బీఐ ఉన్నతాధికారులతో చర్చించిన చంద్రబాబు సెక్యూరిటీ బాండ్లను గ్యారెంటీగా ఇచ్చి రైతుల రుణలను రీషెడ్యూలు చేయించే యత్నంలో ఉన్నారు.

March 31..