Sunday, 3 August 2014

ఆటోలో ఎక్కించుకుని సామూహిక అత్యాచారం

ఓ వివాహితతో స్నేహం చేసి.. ఆ తర్వాత ప్రేమించి.. నమ్మించి ఆటోలో ఎక్కించుకుని సామూహిక అత్యాచారం చేసి.. వేగంగా వెళుతున్న ఆటోలో నుంచి కిందకు తోసేసిన ఘటన వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో చోటు చేసుకుంది.

వివరాలు :

కోల్ కతా శివారల్లోని ఆక్రా ప్రాంతంలో ఓ వివాహిత భర్త నుంచి విడిపోయి తల్లి దగ్గర ఉంటుంది. ఆమెకు షఫిక్ అనే వ్యక్తితో సన్నిహిత సంబంధముంది. దీనిని అవకాశంగా తీసుకున్న షఫిక్ ఆమెకు ఫోన్ చేసి పిలిచి, నెంబర్ ప్లేట్‌లేని ఆటోలో తీసుకెళ్లాడు. ఈ ఆటోలో షఫిక్‌తో పాటు మరో నలుగురు ఉన్నారు. ఆటో ఎక్కిన ఆమెకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు.  దానిని తాగిన ఆమె మత్తులో జోగుతూ నిస్సహాయ స్థితికి   జారిపోగానే ఆటోలో ఐదుగురూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి పని పూర్తికాగానే మత్తులో ఉన్న ఆమెను ఆటోలో నుంచి కిందికి తోసేశారు. ఆటోలోంచి కిందిపడి తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించి, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటుండగా, దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు షఫిక్ కోసం గాలిస్తున్నారు.....

March 31..