Monday, 4 August 2014

మీలో ఎవరు ‘కోటీశ్వరుడు’ ముగింపు ఎపిసోడ్ లో రజనీకాంత్, అనుష్క

మొట్టమొదటిసారిగా ప్రముఖనటుడు అక్కినేని నాగార్జున టీవీ తెరమీద వ్యాఖ్యాత పాత్రలో కనిపిస్తూ మాటీవీలో ప్రసారమవుతున్న ప్రతిష్టాత్మక గేమ్ షో ’ మీలో ఎవరు కొటీశ్వరుడు ’  ఈ సీజన్ ముగింపు ఎపిసోడ్ లో దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ అతిథిగా పాల్గొంటున్నారు. ఇప్పటికే అనేకమంది అతిథులు ఈ కార్యక్రమంలో కనిపించి మెరుపులు మెరిపించిన సంగతి తెలిసిందే. అయితే ముగింపు ఎపిసోడ్ కు ప్రత్యేకత వచ్చేలా రజనీకాంత్ ను, అనుష్కను ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో విద్యాబాలన్, కాజల్, చార్మీ తదితరులు అతిథులుగా హాజరై ప్రేక్షకులను అలరించారు. నిజానికి మా టీవీ మొదట్లో రూపొందించుకున్న పథకంలో లేకపోయినప్పటికీ,  లింగా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన రజనీకాంత్ అన్నపూర్ణా స్టుడియోలోనే ఉండటంతో ఆయనని సెట్స్ కి ఆహ్వానించారు. పాల్గొనవలసిందిగా నాగార్జున కోరినపుడు ఆయన సరేననడంతో  ముగింపు ఎపిసోడ్ షూట్ చేశారు.  అప్పటికే ఆ ఎపిసోడ్ లో కనిపించాలని నిర్ణయమైపోయిన అనుష్క కూడా అందులో ఉన్నారు.

రజనీకాంత్ ఇలాంటి టీవీ కార్యక్రమాలకు దూరంగా ఉండేమాట అందరికీ తెలిసిన విషయమే. అయితే, నాగార్జున ప్రత్యేకంగా కోరటంతో కాదనలేకపోయారని తెలిసింది. ఆ ముగింపు ఎపిసోడ్ కు దక్షిణాది రాష్ట్రాలన్నిటినుంచి అత్యధిక ఆదరణ ఉంటుందని మా టీవీ  భావిస్తోంది. ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంభారీ రేటింగ్స్ సంపాదించుకుంది. అయితే, హిందీలో కౌన్ బనేగా కరోడ్ పతి 8 వ సీజన్ మొదలవుతుండటంతో తెలుగులో ఈ సీజన్ ను ఇంతకుమించి పొడిగించే అవకాశం కూడా లేదని తేలిపోయింది.

March 31..