ఉభయగోదావరి జిల్లాలోని ఏజన్సీ మండలాలు మరియు జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం , గోపాలపురం మొదలగు మండలాలను గిరిజన జిల్లాలో కలపటానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నేడు జంగారెడ్డిగూడెంలోని అన్ని వ్యాపార , విద్యా , సంస్థలను స్వచ్చందంగా మూసివేసి భంద్ పాటించారు . పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు . ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా అన్నీ పార్టీల నాయకులూ , ప్రజలు జంగారెడ్డిగూడెం ను గిరిజన జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసారు .