పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో కిడ్నాప్ కు గురైన వ్యాపారి కుమారుడిని కిడ్నపర్లు హత్య చేశారు.
కొయ్యలగూడెం మండలం కన్నాపురానికి చెందిన హరినాథ్ ను మావోయిస్టులమంటూ కిడ్నాప్ చేసి భారీ మొత్తం డిమాండ్ చేశారు.రూ. 10 లక్షలు ఇస్తే హరనాథ్ ను విడిచిపెడతామని చెప్పిన కిడ్నాపర్లు బాధితుడి తండ్రి వద్ద నుంచి 10 లక్షల రూపాయిలు తీసుకున్నారు.అయితే దుండగులు డబ్బులు తీసుకున్నా హరినాథ్ ను మాత్రం విడుదల చేయలేదు.ఐదు రోజులుగా పలు మలుపులు తిరిగిన ఈ కిడ్నాప్ విషాదాంతమైంది.అతణ్ని అమానుషంగా చంపేశారు.
ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం వినాయకపురం అటవీ ప్రాంతంలో హరినాథ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. హత్య వెనుక పలు కారణాలు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.