Monday, 18 August 2014

రామ్ చరణ్ హీరోగా తిరిగి జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం

మెగస్టార్ చిరంజీవి , అతిలోక సుందరి శ్రీదేవి కలసి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ చిత్రం తో చిరంజీవి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎనలేని స్థానం సంపాదించుకున్నారు. ఈ సినిమాలో  శ్రీదేవి అతిలోకసుందరిగా నటించినా ఈమె కూడా ప్రేక్షకుల గుండెల్లో రియల్ అతిలోకసుందరిగా మారిపోయింది..వైజయంతి మూవీస్ బేనర్ పై అశ్వీనీదత్ నిర్మాతగా , దర్శకేంద్రుడు కె . రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో నిర్మాత కి కనకవర్షం కురిపించింది.

ఐతే దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తిరిగి ఈ చిత్రాన్ని రీమేక్ చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. దర్శకేంద్రుడే స్వయానా ఓ tv ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వూలో చెప్పరు. అలాగే  ఈ సినిమాలో రామ్ చరణ్ హీరో అని అతిలోక సుందరి పాత్రకి మాత్రం శ్రీదేవి కుమార్తె జాహ్నవి ఉండబోదని తెలియజేసారు. సో .... ఎవరా అతిలోక సుందరి ఈ చిత్రం పై పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశాలు ఉన్నాయి.

March 31..