Tuesday, 19 August 2014

అంతర్జిల్లా దొంగలు అరెస్ట్ 46 కాసుల బంగారు ఆభరణాలు,సెల్ ఫోన్స్,ద్విచక్ర వాహనాలు స్వాధీనం

జె.సి.న్యూస్ జంగారెడ్డిగూడెం : రెండు దొంగతనం కేసులను చేదించి 9మందిని అరెస్ట్ చేసి వారివద్దనుండి సుమారు 46 కాసుల బంగారు ఆభరణాలు,సెల్ ఫోన్స్,ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రఘురాంరెడ్డి తెలియజేసారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రఘురాంరెడ్డి మాట్లాడుతూ... గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గల వాదాలకుంట గ్రామంలో మర్చి 28న కొంతమంది ఇంటిలో చొరబడి బంగారు ఆభరణాలు , కొంత నగదు దోచుకున్న కేసులో ఆచంట అప్పారావు, గెడ్డం డేవిడ్ ,వల్లి చిరంజీవి,ఎడ్లపల్లి మండలం రమేష్, ముళ్ళపూడి చిన్న సత్యవతి లను అరెస్ట్ చేసి వారివద్దనుండి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు.

అలాగే చెడు వ్యసనాలకు అలవాటుపడి అంతర్జిల్లా దొంగలుగా మారి పెదవేగి,దెందులూరు ప్రాంతాలలో పలు దొంగతనాలకు పాల్పడిన నలుగురు యువకులు రొక్కం నాగలింగేస్వరరావు,గాజులసుధాకర్,రొక్కం వెంకటేశ్వరావు,కరీముల్లాలను అరెస్ట్ చేసి వారి వద్దనుండి సుమారు రెండున్నర లక్షల విలువైన ఆభరణాలు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రఘురాంరెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో జంగారెడ్డిగూడెం డీ.ఎస్పీ.సుబ్బరాజు, సి.ఐ. అంబికా ప్రసాద్, ఎస్.ఐ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వివరాలకు ఈ వీడియోని చుడండి.  >>

March 31..