Sunday, 17 August 2014

తెలంగాణకు తలవంచిన టీవీ 9

ఎమ్ ఎస్ వో ల సమాఖ్యకు టీవీ9 బేషరతుగా క్షమాపణ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ఎమ్ ఎస్ వో ల సమాఖ్య అధ్యక్షునికి టీవీ 9 ఈ మేరకు చానల్ తరఫున ఎస్. గిరిధర్ సంతకంతో ఒక లేఖ పంపింది 
ఒక కార్యక్రమంలో ప్రసారమైన అసభ్యకరమైన అంశం కారణంగా చానల్ ప్రసారాలను తెలంగాణ అంతటా నిలిపివేసిన సంగతి మనకు తెలిసిందే. ఆ కార్యక్రమ ప్రసారాన్ని తక్షణమే నిలిపివేయటంతోబాటు దానికి బాధ్యులైనవారిని అలాంటి చర్యలకు పాల్పడవద్దని ఆదేశించామని, వెంటనే సంబంధితులందరికీ క్షమాపణలు చెబుతూ స్క్రోల్ నడిపామని, ఈ విషయాన్ని గౌరవ శాసన సభాపతికి, శాసన సభ్యులకు తెలియజేశామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చామని ఆ లేఖలో గుర్తు చేశారు.సంఘానికి బేషరతు క్షమాపణలు చెబుతూ, ప్రసారాల పునరుద్ధరణకు టీవీ 9 విజ్ఞప్తి చేసింది. 



March 31..