Wednesday, 20 August 2014

అమాయకులను లాఠీలతో చావకోడుతున్న పోలీసులు ....గుంటూరు లో ఖాకీ కావరం

సమాజాన్ని రక్షించడానికి,ప్రజల మాన ప్రాణాలకు రక్షణ గా ఉండవలసిన మన పోలీసులు అదే ప్రజలపట్ల కీచకులుగా మారుతున్నారు. గుంటూరు రైల్వే స్టేషన్ లో ఓ ప్రయానికురలిపట్ల ఓ పోలీస్ కానిస్టేబుల్ వేకిలివేశాలతో అసభ్యంగా ప్రవర్తించాడు.ఇదేమని అడిగిన భర్తను మరో పదిమంది పోలీసులతో కలసి చావబాదారు.బూతులు తిడుతూ పోలీసులంటే ఏమిటో రుచి చూపించారు. జరిగిన ఈ దారుణం పై కన్నీరు పెడుతూ స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన భాదితులపై ఎటువంటి కనికరం చూపకుండా ప్రవర్తించాడు అక్కడ సి.ఐ శరత్ బాబు. అంతేకాదు వారిమీదే ఎదురు కేసు పెడతానని బెదిరించాడు. ఇది చూసిన ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. సమాజానికి రక్షణగా ఉండవలసిన పోలీసులు ఇలా రౌడీల్ల ప్రవర్తిస్తే ఎవరితో చెప్పుకోవాలో తెలియక బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 31..