టీవీ ప్రకటనల వ్యవధి మీద ఒక పరిమితి ఉండాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ( ట్రాయ్ ) నిర్ణయించింది. ముఖ్యంగా పే చానల్స్ ఒక వైపు ప్రేక్షకులనుంచి నెలవారీ చందాలు వసూలు చేసుకుంటూనే మరో వైపు ఎడాపెడా ప్రకటనలు వేస్తూ చిరాకుపెడుతున్నాయని ప్రేక్షకుల వైపునుంచి వస్తున్న ఫిర్యాదు. అయితే, నాణ్యమైన ప్రసారాలు అందించాలంటే ప్రకటనలు తప్పనిసరి అని చానల్స్ వాదిస్తున్నాయి. వార్తాపత్రికలు కూడా ప్రకటనలు ప్రచురిస్తూనే పత్రికను అమ్ముకుంటున్నాయి కాబట్టి అదేసూత్రం తమకూ వర్తించాలంటున్నాయి.
ఇక నుంచి ప్రకటనలు ఏ గంటకు ఆ గంటే 12 నిమిషాలు మించకూడదని ట్రాయ్ ఇచ్చిన స్పష్టమైన ఆదేశం ఛానళ్లలో ప్రకటన జోరును కాస్త తగ్గించే అవకాశం ఉంది. ఛానళ్లను, ప్రకటనలను కట్టడి చేయాలంటే ట్రాయ్ ఇంకా కఠినమైన నిబంధనలను రూపొందించాలి.
ప్రకటనలు వేయటానికి ఛానళ్లు ఒక పద్ధతి అనుసరించినట్టు కనిపించటం లేదు. ఎడా పెడా ప్రకటనలు వేసి విసిగించేస్తున్నారు. కొత్త సినిమాలు ప్రసారం చేసేటప్పుడు వేసే ప్రకటనల గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రతి పదినిమిషాలకోసారి ప్రకటనలు వేస్తూ రెండున్నర గంటల సినిమాను ఐదుగంటల పాటు సాగదీసి వేస్తున్నాయి. దీనివల్ల ప్రేక్షకులకు ఎంతో సమయం వృథా అవుతోంది.
ఈ అంశం మీద మీ అబిప్రాయాలు పంచుకోండి.