Sunday, 10 August 2014

11-08-14- భర్త చూస్తుండగానే పెద్దపులి ఓ మహిళను నోటితో కరుచుకుని ఎత్తుకుపోయింది

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఈ రాష్ట్రంలోని సుందర్ బన్స్ అనే ప్రాంతంలో పెద్దపులి ఒకటి గ్రామంలోకి ప్రవేశించింది .  భర్త చూస్తుండగానే  పెద్దపులి ఓ మహిళను నోటితో కరుచుకుని వెళ్లిపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. దయాపూర్ గ్రామంలో నివసించే భగవతి మోండాల్, సునీల్ మోండాల్ దంపతులు. మత్స్యకార కుటుంబానికి చెందిన వీరు.. రోజూ చేపలో, పీతలో పట్టుకుని వాటినమ్ముకుని బతుకు వెళ్ళదీస్తుంటారు. ఎప్పటిలాగే పడవలో సుందర్ బన్స్ వద్ద వేట సాగిస్తున్నారు. ఆ రోజు వారితో పాటు పొరుగు వ్యక్తి పరిమళ్ మృదా కూడా వచ్చాడు. 

అయితే, ఉన్నట్టుండి పెద్ద శబ్దం వచ్చింది. ఏదో పిడుగు పడి ఉంటుందని వారు భావించారు. ఆ సమయంలో పడవ కూడా కుదుపులకు లోనైంది. కానీ, పడవ మధ్య భాగంలో అకస్మాత్తుగా ప్రత్యక్షమైన పెద్దపులిని చూసేసరికి వారికి విషయం బోధపడింది. వారలా నిశ్చేష్టులై చూస్తుండగానే, ఆ పులి భగవతిని నోటకరుచుకుని సమీపంలోని మడ అడవుల్లోకి లాక్కెళ్ళింది.   

ఒక్క గెంతులో అది అక్కడి నుంచి మాయమవడంతో భగవతి భర్త సునీల్, పరిమళ్ నిస్సహాయుల్లా మిగిలిపోయారు. తాము సేకరించిన పీతలు ఏమూలకూ రావని భావించిన వారు ఆ జలాల్లో మరికొంత దూరం ముందుకెళ్ళి వేటాడాలని భావించడమే ఈ విషాదానికి కారణమైంది. ఈ విషయమై స్థానిక స్వచ్ఛంద సేవాసంస్థ ప్రతినిధి పవిత్ర మోండాల్ మాట్లాడుతూ, ఘటనపై అటవీశాఖను నష్టపరిహారం కోరామని, వారు మంజూరు చేశారని తెలిపారు

March 31..