గబ్బర్ సింగ్ స్టామినా హాలీవుడ్ రేంజ్ కు వెళ్లిపోతుందా...? అంటే అవుననే చెప్పాలంటున్నారు టాలీవుడ్ సినీజనం. అసలు సంగతి ఏమంటే , పవన్, వెంకటేష్ కలిసి నటిస్తున్న కొత్త సినిమా " గోపాలా గోపాలా " సినిమాలో పవర్ స్టార్ పవన్ కృష్ణుడిగా కనిపించబోతున్నాడు. ఇందుకోసం పవన్ కాల్షీట్లు 22 రోజులు కావాల్సి వచ్చాయట. అయితే పవన్ కళ్యాణ్ 15 రోజుల్లో అంతా కానించేయాలని అన్నారట.
అందుకుగాను తనకు 15 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ కావాలని చెప్పినట్లు సమాచారం. ఐతే సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు ఎలాగోలా పవన్ కళ్యాణ్ ను రూ. 15 కోట్లకు ఒప్పించారట. పవన్ కళ్యాణ్ తన షూటింగ్ మొత్తాన్ని 22 రోజుల్లో పూర్తి చేస్తాడని అంటున్నారు. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఇందులో వెంకటేష్ సరసన శ్రియ నటిస్తుండగా పవన్ కళ్యాణ్ సరసన ప్రియమణి నటిస్తున్నట్లు కోలీవుడ్ తాజా న్యూస్.