Saturday, 9 August 2014

వై.ఎస్. జగన్ నన్ను మోసం చేశాడు - జూపూడి ప్రభాకర రావు

వైసీపీ  నాయకుడు జూపూడి ప్రభాకర రావు పార్టీకి రాజీనామా చేశారు. తనకు  తానుగా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. రాజీనామా లేఖను కొరియర్ ద్వారా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపటం జరిగిందని  జూపూడి చెప్పారు. మనసు చంపుకొని పార్టీలో ఉండలేక ఈ వైసీపీ కిరాజీనామా నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

శనివారం మీడియాతో మాట్లాడుతూ కృతజ్ఞత, క్రమశిక్షణ లేని వారితో కలిసి ముందుకు సాగలేనని చెప్పారు. వైసీపీలో జగన్ బంధువులకు తప్ప, వైఎస్ అభిమానులకు చోటు లేదని జూపూడి తెలిపారు. వైఎస్‌పై అభిమానంతో జగన్ వెంట నడిచానని, తనను అవమానించేలా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు. జగన్ అరెస్టు అప్రజాస్వామికమని తానే చెప్పానని అయితే జగన్ అరెస్ట్‌కు నిరసనగా జరిగిన ధర్నా కేసులో సమన్లు వస్తే తానెవరో తెలియదని వైఎస్. భారతి తండ్రి వైవీ సుబ్బారెడ్డి తనను ఎంతగానో బాధించిందన్నారు.

ఇకపోతే.. తన ఓటమికి వైవీ సుబ్బారెడ్డితో పాటు పలువురు బంధువులే కారణమన్న జూపూడి ఈ విషయాన్ని జగన్‌కు చెబితే అందరూ తనను మోసం చేశారన్నారని తెలిపారు. జగన్ జైల్లో ఉంటే పార్టీని బతికించుకున్నామన్నారు. వైసీపీ నేతల్లో అభద్రతాభావం ఉందని జూపూడి వెల్లడించారు. వైసీపీ సొంత పార్టీ అనుకున్న పేదలను అవమానిస్తున్నారని ఆయన చెప్పారు. సామంతరాజులకు ఇచ్చినట్టు కొందరికి కొన్నిజిల్లాలు ఇచ్చారన్నారు. జగన్ కుటుంబంపై ఈగ వాలనివ్వలేదని తెలిపారు. పార్టీకి నష్టం జరగవద్దనే ఎన్నికల ముందు నోరు విప్పలేదని జూపూడి ప్రభాకర్ రావు అన్నారు.

గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా కొండేపి నుంచి పోటీ చేసి ఓడిపోయిన జూపూడీ ఇంకా మాట్లాడుతూ... వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఉన్న గౌరవంతోనే తాను ఇన్నాళ్లు పార్టీలో కొనసాగినట్లు తెలిపారు. తండ్రి లేని జగన్‌కు తాను అండగా ఉంటానని గత ముఖ్యమంత్రులకు తాను చెప్పినట్లు జూపూడి తెలిపారు. ఇప్పటికీ వైవీ, బాలినేని మాట్లాడుకోరన్నారు. తగిన ప్రాధాన్యత లేక పోవడంతో పాటు.. నన్ను అవమానించడం వల్లే గత కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్టు చెప్పారు.


March 31..