Wednesday, 30 July 2014

రెజ్లింగ్‌లో భారత రెజ్లర్లు అద్భుత సత్తా

గ్లాస్గో,
కామన్వెల్త్ గేమ్స్‌లో మంగళవారం భారత రెజ్లర్లు  ఒకే రోజు మూడు పసిడి పతకాలతో సత్తా చాటుకున్నారు. పురుషుల 57 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో అమిత్ కుమార్, 74 కిలోల విభాగంలో ఒలింపిక్ మెడలిస్టు సుశీల్ కుమార్, మహిళల 48 కిలోల విభాగంలో వినేష్ తమతమ ప్రత్యర్థులను కుమ్మేసి పసిడి పతకాల పంట పండించారు. పురుషుల 57 కిలోల ఫ్రీస్టయిల్ ఫైనల్ బౌట్‌లో అమిత్ కుమార్ 3-1 తేడాతో నైజీరియాకు చెందిన ఎబిక్వెమినోమో వెల్సన్‌ను మట్టి కరిపించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, మహిళల 48 కిలోల ఫ్రీస్టయిల్ ఫైనల్ బౌట్‌లో వినేష్ 3-1 తేడాతో ఇంగ్లాండ్ రెజ్లర్ యానా రట్టిగన్‌ను చిత్తుచేసి పసిడి పతకాన్ని చేజిక్కించుకుంది.సోమవారం అర్ధరాత్రి జరిగిన 85 కేజీల విభాగంలో ఠాకూర్ స్నాచ్‌లో 150 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 183 కేజీలు (మొత్తం 333 కేజీలు) బరువు ఎత్తాడు.అయితే పతకం విషయంలో తనకు కాస్త ‘అదృష్టం’ కూడా తోడైంది. కాంస్యం సాధించిన పాస్కల్ ప్లమోండన్ కూడా 333 కేజీ (151+182)ల బరువు ఎత్తి సమానంగా నిలిచాడు. దీంతో లిఫ్టర్ల శరీర బరువు కీలకమైంది. వికాస్ 84 కేజీల బరువు ఉండగా కెనడాకు చెందిన పాస్కల్ 85 కేజీల బరువున్నట్టు తేలింది. దీంతో వికాస్ రజతంతో మెరిశాడు. ఇక ఈ విభాగంలో స్వర్ణ పతకాన్ని న్యూజిలాండ్‌కు చెందిన రిచర్డ్ ప్యాటర్సన్ (335 కేజీ; 151+184) దక్కించుకున్నాడు.పురుషుల ట్రాప్ ఈవెంట్‌లో మానవ్‌జీత్ సింగ్ సంధు మంగళవారం భారత్‌కు కాంస్య పతకాన్ని అందించాడు. ఈ ఈవెంట్ సెమీఫైనల్స్‌లో మొత్తం 15 లక్ష్యాలకు గాను 13 లక్ష్యాలను ఛేదించి తృతీయ స్థానంలో నిలిచిన మానవ్‌జీత్ ఆ తర్వాత కాంస్య పతకం కోసం జరిగిన పోరులో ఆస్ట్రేలియాకు చెందిన ప్రఖ్యాత షూటర్ మైఖేల్ డైమండ్‌ను ఓడించాడు. ఈ పోరులో మానవ్‌జీత్, డైమండ్ సరిసమానంగా 11 సార్లు లక్ష్యాలను ఛేదించి సమవుజ్జీలుగా నిలువడంతో ఫలితాన్ని తేల్చేందుకు ‘షూట్-ఆఫ్’ను నిర్వహించాల్సి వచ్చింది. ఇందులో మానవ్‌జీత్ లక్ష్యాన్ని ఛేదించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో షూటింగ్ ఈవెంట్లలో భారత్ సాధించిన పతకాల సంఖ్య 13కు పెరిగింది.

March 31..