Wednesday, 30 July 2014

నిత్యావసరాల (ఆహార పదార్ధాల) ధరలు నింగినంటుతున్నాయి


మన దేశంలోని అత్యధికుల కొనుగోళ్ళుదరిదాపుగా ఆహార పదార్థాలకే పరిమితం అయ్యాయి. వాటి ధరలు మాత్రం పెరుగుతూనే పోయాయి.ప్రభుత్వ విధానల లోపం వలన ఆ పెరుగుదల నేటికీ కొనసాగుతోంది. సామాన్యుల నిత్యావసరాలపైఅశనిపాతం. ఈ పెరుగుదల వలన నిత్యావసరాల ధరలు ఇంత పెరుగుతున్నా దీని విషయంలో కేంద్ర ప్రభుత్వం తగిన చొరవ చూపడం లేదు. పైగా భారాన్ని అంతటినీ రాష్ట్రప్రభుత్వం పైకి తోసివేస్తూ వుంది. ప్రభుత్వాల ఈ బాధ్యతారాహిత్యం ప్రజల జీవితాలను దినదినగండం-నూరేళ్ళాయుషుగా మార్చివేసింది.
బియ్యం ధర  రూ. 46
టమోటాలు ఒక కిలోగ్రాము రూ. 60 ,
ప్రభుత్వ విధానల లోపం వలన ఆ పెరుగుదల నేటికీ కొనసాగుతోంది.నిత్యావసరాల (ఆహార పదార్ధాల) ధరలు నింగినంటుతున్నాయి..నిర్లిప్తంగా వ్యవహరిస్తోన్న పాలకులు ప్రజలకి ఉచిత సలహాలను ఇస్తున్నారు. పంచదార ధరలు పెరిగాయని ప్రజలు నిలదీస్తే తినడం మానేయండి పంచదార వలన చెక్కెర వ్యాధి వస్తుందని కేంద్ర అమాత్యులే మాట్లాడటం దీనికి చిన్న ఉదాహరణ.
బడ్జెట్ లోని అనాలోచిత విధానాల వలన ఆహార ధరలు మరింత పెరిగే అవకాశాలే నేడు మెండు. ఈ నేపథ్యంలో మన దేశ జనాభాలోని 77% ప్రజల నిజ ఆదాయం గత అంచనాల స్థాయి అయిన రోజువారి 20రూపాయలుగా మిగలడం కూడా గగనమే. కుదేలైన కొనుగోలు శక్తితో కటకట పడే సామాన్యుడు పాలకులను కుదేలు చేసే స్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు.

March 31..