రాజకీయ పార్టీల ప్రచారాన్ని నమ్మడం సంగతి అలా ఉంచితే ఏకంగా ప్రభుత్వాలే అసత్యాలు చెబుతున్నాయని రిజర్వు బ్యాంకు వంటి సంస్థలు అబిప్రాయపడుతున్నాయనుకోవాలి. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తన రుణమాఫీ హామీలో భాగంగా బ్యాంకులు మాఫీ చేయకపోతే పోని అని, రీషెడ్యూల్ కోసం నివేదికలు తయారు చేసి పంపాయి.దాని ప్రకారం ఎపిలో రైతులంతా కష్టాలలో ఉన్నట్లు వాదించింది.వెంటనే రుణాలు రీషెడ్యూల్ చేయాలని కోరింది.కాని రిజర్వు బ్యాంకు మాత్రం ఆయా ప్రాంతాలలో పంట దిగుబడులపై ఆరా తీసింది.దాంతో వారికి వచ్చిన సమాచారం ప్రకారం గత నాలుగేళ్ల తో పోల్చితే పంట దిగుబడి తగ్గినట్లు ఎక్కడా వెల్లడి కాలేదట.దాంతో ఆర్బిఐ ఆంద్ర్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తూ సర్కారు కారణాలు అంగీకారయోగ్యంగా లేవని స్పష్టం చేసింది.
సగటు పంట దిగుబడి 50 శాతం కన్నా తక్కువగా ఉంటేనే వ్యవసాయ రుణాల రీషెడ్యూల్ కు అర్హత ఉంటుందని ఆర్ బిఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపాలి పంత్ జోషి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో రుణాల రీషెడ్యూల్ చేయజాలరని స్పష్టమైంది. అయితే ఏతా వాతా ఎపి ప్రభుత్వానికి షాక్ వంటిదని పిటిఐ వ్యాఖ్యానించడం విశేషం.