ఉరుము ఉరిమి మంగళం మీద పడిందన్నట్లు ఉండి ఉండి మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ మీద విరుచుకుపడ్డాడని తెలుస్తోంది. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ తరువాత ఎన్నికల్లో బీజేపీలో చేరి పోటీ చేసేందుకు అవకాశం లేక ఆ తరువాత బీజేపీలో చేరిన కావూరి ప్రస్తుతం అందులోనే కొనసాగుతున్నారు. ఇటీవల ఎన్నికలలో బీజేపీ పార్టీ – టీడీపీ పొత్తు కుదుర్చుకుని ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా ఈ రోజు ఆయన టీడీపీ పార్టీ మీద విమర్శలు గుప్పించినట్లు వచ్చిన వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇవి ఆయన వ్యక్తిగతమా లేక పార్టీ పరంగా చేసినవా అన్నది తెలియడం లేదు.
“వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కన్నా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీకే ఎక్కువ స్థానాలు వస్తాయని, తెలుగుదేశం పార్టీ తమకు మిత్రపక్షమయినా తాము అన్యాయాన్ని ఎదుర్కొంటామని, తెలుగుదేశం పార్టీ రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తుందని” కావూరి సాంబశివరావు అన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం – బీజేపీలలో దేనిలోనూ అవకాశం దొరక్క చివరినిమిషంలో బీజేపీ తీర్ధం పుచ్చుకున్నాడు కావూరి. మరి ఆయన ఈ వ్యాఖ్యల వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి అన్నది తేలాల్సి ఉంది