Saturday, 9 August 2014

టాప్ రేంజిలోమహేష్ బాబు

ప్రస్తుతం తెలుగులో టాప్ రేంజిలో ఉన్న హీరోల్లో మహేష్ బాబు ఒకరు. మంచి వ్యత్తిగా ,వివాద రహితుడైన మహేష్ బాబు మర్యాదగల వ్యక్తిగా, చాల సాఫ్ట్ పర్సన్‌గా పేరు తెచ్చుకున్నారు. తన కెరీర్లో మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అలాంటి సూపర్ మిట్ చిత్రాల్లో నటించిన మహేష్ బాబు......బాల నటుడిగాను తనదైన టాలెంట్ తో ఆకట్టుకున్నారు. సినిమా కుటుంబంలో జన్మించడంతో చిన్నతనంలోనే సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. మహేష్ బాబు తన సినీ ప్రస్థానాన్ని తన సోదరుడు రమేష్ బాబు నటించిన " నీడ " చితం లో ఒక చిన్న పాత్ర తో మొదలు పెట్టాడు. 1983 లో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మనవి మేరకు పోరాటం సినిమా లో తన తండ్రి కృష్ణ గారికి తమ్ముడి గా నటించాడు. ప్రముఖ దర్శక-నిర్మాత డూండీ ఆ చిత్రం లో మహేష్ నటన చూసి అతను కృష్ణ గారి అబ్బాయి అని తెలుసుకుని ఆశ్చర్యపోయి ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది అని కితాబు ఇచ్చారు. అయన ఊహించిన విధంగానే బాల నటుడి గా తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందినాడు.

March 31..