పదేళ్ళ క్రితం గూగుల్ ప్రారంభించిన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ‘ఆర్కుట్’ ఇక ముందు కనిపించదు. ఆర్కుట్, ఫేస్ బుక్ ఒకేసారి
వచ్చినా ఆర్కుట్ కు భారత్, బ్రెజిల్ మినహా మిగతా దేశాల్లో నెటిజన్ల ఆదరణకు నోచుకోకపోవడంతో సెప్టెంబర్ 30 నుంచి ఆర్కుట్ ను నిలిపివేయాలని గూగుల్ నిర్ణయించింది.
వచ్చినా ఆర్కుట్ కు భారత్, బ్రెజిల్ మినహా మిగతా దేశాల్లో నెటిజన్ల ఆదరణకు నోచుకోకపోవడంతో సెప్టెంబర్ 30 నుంచి ఆర్కుట్ ను నిలిపివేయాలని గూగుల్ నిర్ణయించింది.
అర్కుట్ తో పోల్చుకుంటే యూట్యూబ్, బ్లాగర్, గూగుల్ ప్లస్ గణనీయమయిన పురోగతి సాధించాయని, వాటితో పోల్చితే ఆర్కుట్ వెనకబడిపోయిందని భావిస్తున్నట్టు గూగుల్ వర్గాలు చెబుతున్నాయి. ఆర్కుట్ తో పాటే పుట్టిన ఫేస్ బుక్ వంద కోట్ల 28 లక్షల మంది యూజర్లతో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఫేస్ బుక్ ఇప్పుడు రారాజుగా కొనసాగుతోంది.