తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో వైఫై ఆలోచనలు ఇంకా తర్జనభర్జనలు పడుతుంటే… చంద్రబాబు సర్కారు ఆంధ్రప్రదేశ్ నగరాలనే కాదు, గ్రామాలను కూడా వైఫైతో అనుసంధానం చేసేందుకు అన్నీ సిద్ధం చేసేసింది. ఆంధ్రప్రదేశ్ లోని 1600 గ్రామపంచాయతీలకు వైఫై సదుపాయం కల్పించే దిశగా అడుగులు వేసేసింది. ఇది అమలులోకి రావాలంటే రాష్ట్రమంతటా ఫైబర్ ఆప్టికల్ నెట్ వర్క్ ఉండాలి. ఇందుకోసం పవర్ గ్రిడ్ కార్పరేషన్ 28000 వేల కిలోమీటర్ల పొడవునా ఫైబర్ ఆఫ్టికల్ నెట్ వర్క్ నిర్మాణానికి టెండర్లు పిలిచింది. అంతేకాదు, ఈ పని మొత్తం వచ్చే ఏడాదికి పూర్తి కావాలని నిబంధనలు విధించింది. ఇప్పటికే ఈ పనులు సంబంధించిన అన్ని అనుమతులు అత్యంత వేగంగా మంజూరు చేయాలని అన్ని ప్రభుత్వ విభాగాలను ఆదేశించింది. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం 2015 డిసెంబరు నాటికి ప్రతి గ్రామంలో వైఫై, బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉండేలా చేయడం.
ఇదిలా ఉండగా, ఈ పథకానికి సంబంధించిన ఎక్విప్ మెంట్ మొత్తం కేంద్రప్రభుత్వమే ఇవ్వనుంది. ఈ కార్యక్రమం ఆలస్యం కాకుండా ఉండటానికి అన్ని జిల్లాలను విభాగాలుగా విభజించి సమాంతరంగా పనులు ప్రారంభించనున్నారు. అన్నిరకాల నెట్ వర్క్ ప్రొవైడర్లకు రాష్ట్ర ప్రభుత్వ ఆన్ లైన్ల సేవలు అందించే ఏజెన్సీలుగా రాష్ట్ర ప్రభుత్వం వాడుకోనుంది. ఇటీవలే చంద్రబాబు రాష్ట్రంలో ప్రతిదీ ఆన్ లైన్లోనే అందుబాటులో ఉండేలా చేయాలన్నదే లక్ష్యంగా ప్రకటించారు. అది నెరవేరాలంటే ఇంటర్ నెట్ మారుమూలల్లో కూడా అందుబాటులో ఉండాలి. ఈ-హెల్త్ , ఈ -ఎడ్యుకేషన్, ఈ-గవర్నెన్స్ వంటి సర్వీసులు అమలు కావడానికి ఇది దోహదపడుతుంది. ఇప్పటకే విశాఖపట్నం జిల్లా పరవాడలో పైలట్ ప్రాజెక్టు మొదలైంది. ఇక్కడ ప్రతిదీ ఆన్ లైన్ ఆధారంగానే సేవలు అందిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టడానికి మరో ముఖ్యమైన కారణం ఉంది. ఏపీలో ఎన్నున్నా ఐటీ కంపెనీలు, ఐటీ ఎగుమతులు చాలా తక్కువ ఉన్నాయి. ఈ లోటు భర్తీ అయితేనే అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులు సాధ్యం. ఈ నేపథ్యంలో ఆ కంపెనీలు వేగంగా ఇక్కడికి తరలిరావాలంటే రెండు ముఖ్యమైన సదుపాయాలు ఉండాలి. అవి కరెంటు, ఇంటర్నెట్. అందుకే ముందు ఈ రెండింటిపై చంద్రబాబు దృష్టి పెట్టాడు.
కొసమెరుపు: తొలుత ప్రతి గ్రామ పంచాయతీకి వైఫై అందిస్తారు. దాని ద్వారా వైఫై సదుపాయాన్ని ప్రజలు, అక్కడి కంపెనీలు పొందవచ్చు. కానీ ఏ సదుపాయమైనా డబ్బులు చెల్లించాల్సిందే. ఇది ఉచిత పథకం కాదు.