Friday, 1 August 2014

పోలీసుల వేధింపులతో ఓ యువకుడి ఆత్మహత్య

గుంటూరు లాలాపేట పోలీసుల నిర్వాకం... ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. శంకర్ అనే యువకుడిపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారు. బైక్ చోరీ చేశాడంటూ అదుపులోకి తీసుకున్న పోలీసులు మూడు రోజులుగా నిందితుడిని చిత్రహింసలు పెట్టారు. అవమానం తట్టుకోలేక శంకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శంకర్ విజయవాడ నగరంలోని కృష్ణలంక వాసి.

తన మృతికి సీఐ వినయ్ కుమార్, ఎస్సైలు వీరాస్వామి, నాయక్, కానిస్టేబుల్ అజర్ లే కారణమంటూ మృతుడు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. మంగళగిరి పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 306 కింద కేసు నమోదయ్యింది.

March 31..