Friday, 15 August 2014

స్వాతంత్ర దినోత్సవ వేడుకల సాక్షిగా చెప్పు తీసుకుని వెంటబడి మరీ కొట్టింది

ఆగస్టు 15 జెండా పండుగ. జిల్లా వై.సీ.పీ పార్టీలో మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఆమె. ఆమెకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. గత కొన్నాళ్లుగా పార్టీ కార్యాలయానికి కూడా జిల్లా అధ్యక్షుడు తాళం వేసుకుని వెళ్తున్నాడు. అంతే ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. సమాచారం ఎందుకు ఇవ్వడం లేదు. పార్టీ కార్యాలయానికి తాళం ఎందుకు వేసుకుంటున్నావు అని చెప్పు తీసుకుని వెంటబడి మరీ కొట్టింది. పక్కనే ఉన్న వారు వారిస్తున్నా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా రెచ్చిపోయింది. దీంతో పార్టీ కార్యకర్తలు నిర్ఘాంత పోయారు.

కరీంనగర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేధాలు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సాక్షిగా బహిర్గతమయ్యాయి. పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి, పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి గంటా సుశీలకు మధ్య మొదలయిన వాగ్వివాదం మాటా మాటా పెరిగి చెప్పులతో కొట్టుకునేదాకా వెళ్లింది. సమాచారం ఇవ్వలేదని సుశీల చెప్పుతీసుకొని విపరీతంగా కొట్టింది. కొందరు కార్యకర్తలు ఆమెకు సహకరించగా ..మరికొందరు వద్దని వారిస్తున్నా ఆమె వెనక్కి తగ్గలేదు.

నీలాంటి వాళ్ల మూలంగానే పార్టీ భ్రష్టుపట్టిపోతుందని, పార్టీ తరపున కార్యక్రమం చేస్తూ తనకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని సుశీల అసభ్యకర పదజాలంతో దూషించింది. తనను గానీ, పార్టీ కార్యకర్తలను గానీ ఏమీ చేయలేవని బాస్కర్ రెడ్డిని హెచ్చరించింది. వ్యవహారం చెప్పులతో కొట్టుకునే దాకా వెళ్లడంతో కార్యకర్తలు అవమానంతో తలలు పట్టుకున్నారు.

March 31..