27-08-14 బుధవారం
పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం ధర్బగూడెం సమీపంలో గల ఓ ధాబా వద్ద ఉత్తరప్రదేశ్ కు చెందిన లారీ డ్రైవర్ రషీద్ ది .13-08-2014 న హత్య కు గురయ్యాడు.
హత్య జరిగిన 15 రోజులలోపు జంగారెడ్డిగూడెం CI అంబికా ప్రసాద్ అధ్యర్యం లో నిందితులను పట్టుకొని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. జంగారెడ్డిగూడెం DSP AV సుబ్బరాజు వివరాలను వెల్లడిస్తూ.....
మహారాష్ట్ర లో పేరుమోసిన పార్దీ గ్యాంగ్ కు చెందిన లోకేష్ భోస్లే (48), ఎల్లా సింధీ (25),మొహర్ర సింధీ (19),రఘు భోస్లే (50) గా గుర్తించారు.వీరిలో మొదట ముగ్గురు 14-08-14 వ తేదీన కోయ్యలగుడెం లోని ఓ కళ్యాణ మండపం వద్ద పార్క్ చేసిన ఇన్నోవా కారు వెనుక అద్దాలు పగులగొట్టి, అందులోని బ్యాగ్ లను ప్రక్కన ఉన్న తోటలోకి తీసుకువెళ్ళి అందులో ఉన్న 13 1/2 కాసుల బంగారు వస్తువులను దొంగిలించుకు పోయారని DSP వివరించారు.
ఈ ముద్దాయిల నుండి 3 చాకులు, ఒక స్క్రూ డ్రైవర్ , రెండు సెల్ ఫోన్స్, స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పారు.
నిందితులు మహారాష్ట్ర లో కోలాపూర్ జిల్లా కు చెందిన వారని, వీరు గత కొద్ది కాలంగా అశ్వారావుపేట,పేరాయిగూడెం వద్ద మోడల్ కాలనీ ప్రాంతంలో గుడారాలు వేసుకొని నివసిస్తూ పూసలు,ఫ్యాన్సీ వస్తువులు వంటివి అమ్ముతూ తిరుగుతుంటారని, వీరు చాలాకాలంగా హైవే పై లారీ లను ఆపి నిద్రపోతున్న డ్రైవర్ ల వద్ద నుండి డబ్బులు దొంగిలించుకు పోవడం చేస్తున్నారని, ఐతే లారీ డ్రైవర్లు వేరు వేరు ప్రాంతాలకు చెందిన వారు కావడంతో ఎక్కడా ఫిర్యాదులు నమోదు కాలేదని ,ఇటువంటి వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని DSP AV సుబ్బరాజు వివరించారు.
ఈ కేసును త్వరగా చేధించిన జంగారెడ్డిగూడెం CI అంబికా ప్రసాద్ , జీలుగుమిల్లి SI క్రాంతి కుమార్, సర్కిల్ క్రైమ్ పార్టీలు,H.C లు దిలీప్,రాజేంద్ర,ఎర్రయ్య,పీసీ కిరణ్, మరియు కొయ్యలగూడెం,పోలవరం పోలీసులను, DSP సుబ్బరాజు ప్రత్యేకంగా అభినందించారు.
