ఆనాడు చిరంజీవి వల్ల ఓడిపోయాం.. ఈనాడు పవన్ కళ్యాణ్‌తో గెలిచా !!
2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వల్ల తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని, 2014లో జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వల్ల టీడీపీ గెలుపొందినట్టు రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి పైడికొండల మాణిక్యాల రావు వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి వల్ల కాపులకు రాజకీయాల్లో తగిన గుర్తింపు లభించిందన్నారు.
ప్రస్తుతం కాపు వర్గీయులు దూడుకు స్వభావంతో, దాడులు చేసే వారిగా సమాజంలో ముద్రపడ్డారని, దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు. కోస్తా జిల్లాల్లోని కాపు ఓటు బ్యాంక్ వల్లే తెలుగుదేశం ఏపీలో అధికారంలోకి వచ్చిందని రామచంద్రాపురం ఎమ్మేల్యే తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించారు.
దీనిని గుర్తించే పదవిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పదవిని కాపులకు ఇచ్చారన్నారు. రాష్ట్ర విభజన వల్ల కాపులకు మంచే జరిగిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాతే కాపులను బీసీల్లో చేర్చే ప్రక్రియ వేగవంతమైందని చెప్పారు. రాష్ట్రం కలిసి ఉంటే కాపులను బీసీలో చేర్చే పరిస్థితి ఉండేది కాదన్నారు.