Thursday, 31 July 2014

పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్

సంవత్సరం పైగా ‘గబ్బర్‌సింగ్ 2’ సెట్స్‌కు వెళ్తోందని… ఫ్యాన్స్‌ను ఊరిస్తూ వస్తున్న ఈ సినిమా న్యూస్‌కి ఇక ఫుల్‌స్టాప్ పడినట్టేనని విశ్వసనీయ సమాచారం. ఈ సినిమాని పక్కనపెట్టి వేరే ప్రాజెక్ట్‌తో ప్రొసీడ్ అయ్యే న్యూస్ త్వరలో వస్తోందని లేటెస్ట్ న్యూస్

డైరెక్టర్ సంపత్‌నంది ‘గబ్బర్ 2’ స్క్రిప్ట్ – స్క్రీన్ ప్లే పవన్ మెచ్చేలా ఇప్పటికీ డిజైన్ చేయకపోవడమే అందుకు కారణమట. త్రివిక్రమ్ ఈ స్క్రిప్ట్‌లో ఇన్వాల్వ్ అవుతాడని పవన్ భావించినా అలా జరగకపోవడం, మరోవైపు హీరోయిన్ కూడా సెట్ అవకపోవడం దీనికి కారణాలుగా చెబుతున్నారు. ఎలాగోలా హడావుడిగా ఈ సినిమాని సెట్స్‌పైకి తెచ్చినా.. తనకే శాటిస్‌ఫ్యాక్షన్ లేని స్ర్కిప్ట్, స్ర్కీన్ ప్లేతో ఫ్యాన్స్‌ను, ఆడియన్స్‌ను డిజప్పాయింట్ చేయడం ఇష్టంలేకనే ‘గబ్బర్ 2’కు పవన్ ఫుల్‌స్టాప్ పెట్టినట్టు ఇన్‌సైడ్ టాక్. ఈ మూవీ ప్లేస్‌లో మరో ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్ రెడీ అవుతోందని ఈ సినిమాకి శరత్ మరార్ నిర్మాత‌గా ఉంటాడని సమాచారం. ఐతే ఈ సినిమాని సంపత్ నంది డైరెక్ట్ చేసే అవకాశముందని టాక్.

March 31..