సీఎం చంద్రబాబు నాయుడు బాంబు పేల్చారు. రుణాల రీషెడ్యూల్కు రిజర్వు బ్యాంక్ ఒప్పుకోవడంలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రీషెడ్యూల్ ఇబ్బందిగా మారిందని, సమయం మించి పోవడంతో ఆర్బీఐ 'నో' చెప్పిందన్నారు. శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వీలైనంత త్వరగా కుటుంబానికి రూ.1.5 లక్షల చొప్పున రుణమాఫీ చేద్దామని కలెక్టర్లకు చెప్పారు.
రుణమాఫీపై రిజర్వు బ్యాంకు నుంచి ఇంకా కొన్ని మార్గదర్శకాలు రావాలని, బ్యాంకులకు ష్యూరిటీలు చెల్లిస్తామని, ఏదేమైనా రుణమాఫీ సాధిస్తామని బాబు చెప్పారు. ఇక కడప, అనంతపురం జిల్లాలను కరవు ప్రాంతాలుగా గుర్తించి ప్రత్యేక ప్యాకేజీలు తయారుచేయాలని రెండు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.