Latest Political News | New Movie News |Top Photos | Film Reviews | New Movie Videos
Thursday, 28 August 2014
వైఎస్ జగన్ - తెదేపా మాటల యుద్ధం
వైఎస్ పాలన స్వర్ణయుగం.. ఆయన పాలన దేవుడి పాలన. ఆయన చల్లని నీడలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ప్రజలు సుఖ సంతోషాలతో అలరారు. ఇదీ తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ప్రస్తుత ప్రతిపక్ష నేత జగన్ చేస్తున్న వర్ణనలివి. అంతేకాదు.. వైఎస్ లా పాలించే దమ్ముందా అంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు జగన్ సవాలు విసురుతున్నారు.
అసలు వైఎస్ పాలనలో సగం పాలన అందిచగలరా అని ప్రశ్నిస్తున్నారు. నిజమే.. వైఎస్ తరహా పాలన అందించడం బాబుకి సాధ్యం కాదని తెదేపా నేతలు అంటున్నారు.
దీనికి వారు కొన్ని కారణాలు చెబుతున్నారు. అవి ఏంటో మీరే చూడండి..
వైఎస్ పాలనలో ప్రభుత్వ భూములను అస్మదీయులకు అడ్డగోలుగా పంచేశారు.
వేలాది ఎకరాల భూములను సెజ్ ల రూపంలో తన అనుయాయులకు కట్టబెట్టారు.
ఈ తరహా పాలన అందించే దమ్ము చంద్రబాబుకు లేదు.
వైఎస్ పాలనలో ఐఏఎస్ అధికారులు పడ్డ కష్టాలు ఎన్నో. ఎంతో సమర్థత ఉన్న శ్రీలక్ష్మి వంటి అధికారులు కూడా అవినీతి మకిలి అంటుకుని జైలుపాలయ్యారు. చివరకు ఆ అవమానభారంతో అనారోగ్యం పాలయ్యారు. అధికారులను ఇలాంటి ఇబ్బందులకు గురి చేసి వారిని అవినీతపరులుగా మార్చే దమ్ము చంద్రబాబుకు లేదు.
వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. ఆయన కుమారుడు జగన్ అధికార కేంద్రంగా తయారయ్యారు. ఏ కంపెనీకైనా ప్రభుత్వంనుంచి సహకారమందాలంటే వారు.. తప్పని సరిగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాల్సిందే.. ఇలా అందినంత నొల్లేసుకునే దమ్ము చంద్రబాబుకు లేదు.
వైఎస్ అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలకు వేధింపులు ఉండేవి. దాదాపు 189మంది కార్యకర్తలు హత్యకు గురయ్యారు. తనకు ప్రాణ భయం ఉందని మాజీ మంత్రి పరిటాల రవి ఎంత చెప్పినా ప్రభుత్వం స్పందించలేదు. చివరకు ఆయన కూడా హత్యకు గురయ్యారు. ఇలా రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరుగుతున్నా పట్టించుకోకుండా ఉండే దమ్ము చంద్రబాబుకి లేదు.